అల్లు అర్జున్ తొలిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా 5 భాషలలో విడుదల అయితే 5 భాషలలోనూ అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పకపోవడం ఇప్పుడు ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది అని చెప్పవచ్చు. కేవలం తెలుగులో మాత్రమే ఆయన డబ్బింగ్ చెప్పాడు కానీ ఇతర హీరోలు తమ సినిమాలకు సంబంధించి అన్ని భాషలలో సినిమా విడుదలైతే అన్ని భాషలలోనూ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ విధంగా చేయకపోవడం ఏంటి అని వారు నిరుత్సాహ పడుతున్నారు.
తాజాగా పాన్ ఇండియా సినిమా గా విడుదల అవుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన హీరోలు ఇద్దరు కూడా ఇతర భాషలలో తమ పాత్రలకు సంబంధించి డబ్బింగ్ చెప్పగా అల్లు అర్జున్ చెబితే ఇంకా బాగుండేదని వారందరికీ తో పాటు మంచి పోటీ చేస్తూ ఉండేవాడిని అని ప్రేక్షకులు చెబుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం ఇప్పటికే విడుదల కాగా రెండవ భాగం దసరా కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. మరి పుష్ప మొదటి భాగం సినిమా లాగానే ఈ రెండో భాగం కూడా హిట్ అవుతుందా అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి