చిన్న సినిమాలతో తన కెరియర్ ను మొదలు పెట్టి సాహో లాంటి భారీ ప్రాజెక్టును చేపట్టాడు దర్శకుడు సుజిత్.  కొన్ని సార్లు ఎలాంటి సినిమా చేశాము అనేది కాదు ఆ సినిమా ఎంతటి సక్సెస్ ను సాధించింది అనేది మేటర్ లోకి వస్తుంది.  అది ఇప్పుడు సుజిత్ విషయం లో కూడా జరిగింది. ఆయన ఒక్కసారిగా ప్రభాస్ నటించిన సాహో సినిమా తో పాపులర్ అయ్యాడు. అంతే కాదు అన్ని భాషల హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలనీ డిమాండ్ చేశారు. ఆ విధంగా తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ సుజిత్ కు పెరిగింది.

సాహో సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయనకు భారీ డిమాండ్ ఏర్పడింది అంటే ఆయన తన దర్శకత్వం తో ఏ విధంగా అందరినీ ఆకట్టుకున్నాడో అర్థం అవుతుంది. ఆ విధంగా సుజిత్ 350 కోట్ల సినిమా చేసి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచ గా కలెక్షన్లు రెట్టింపు వచ్చినా కూడా కమర్షియల్ గా ఈ చిత్రం పెద్దగా ఆడలేదు అయితే సినిమా సరిగా ఆడకపోవడంతో ఈ దర్శకుడితో సినిమా చేయడానికి తెలుగు హీరోలు ఎవరు ముందుకు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ చేయాలని భావించి ప్రయత్నించగా ఆయన స్క్రిప్ట్ తో ఏమాత్రం మేప్పించలేకపోయాడు.

దాంతో ఆయన్ని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. ఆ విధంగా ఆయన మళ్లీ ఖాళీ అయిపోయాడు. తాజాగా ఈ దర్శకుడు సుధీప్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న సుదీప్ ను ఈ మధ్యనే కలిసిన సుజిత్ ఒక కథ చెప్పి ఆయనతో ఓకే చేయించుకున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రానుంది త్వరలోనే. మరి ఈ సినిమా తో ఈ దర్శకుడు ఎలాంటి కం బ్యాక్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: