మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమకు ఉప్పెన అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఇదే సినిమాతో కొత్త హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఇక మొదటి సినిమాలోనే తన అందం అభినయంతో ఎంతోమంది ని ఆకట్టుకుంది ఈ సొట్టబుగ్గల సుందరి. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా కావాలి అని చెబుతూ ఉంటారు. అయితే కృతి శెట్టి అదృష్టం బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. మొదటి సినిమానే మంచి విజయం సాధించడమే కాదు ఆ తర్వాత కూడా వరుస అవకాశాలు వచ్చి ఇక ఈ సొగసరి ముందు వాలిపోయాయి.


 అంతేకాదు దర్శక నిర్మాతలు చూపులు ఆకర్షించడంలో కూడా ఈ ముద్దుగుమ్మ సక్సెస్ అయింది. దీంతో మా సినిమాలో కృతి శెట్టి కావాలి అంటూ పట్టుబడుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమాలో అవకాశం  దక్కించుకోవడమే కాదు లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయి ఇక యూత్ అందరిని మరింత ఆకర్షించింది. ఇక ఆ తర్వాత నాగార్జున నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన బంగార్రాజు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కూడా ఈ అమ్మడు నటిస్తోంది అని టాక్. అయితే ఇక వరుస విజయాలతో సాధిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా అంతకంతకు పెంచుతుంది అని అర్థమవుతుంది. మొన్నటి వరకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న కృతి శెట్టి ఇక ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. అయితే కృతి శెట్టి సుధీర్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు కంటే ఎక్కువగా కృతి శెట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. సుధీర్ బాబు హీరోగా కేవలం ఒక కోటి వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటు ఉండగా.. కృతి శెట్టి మాత్రం రెండు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా నిర్మాతలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు.దీనికి సంబంధించిన టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: