జబర్దస్త్ షో ద్వారా ఎంతో  క్రేజ్ ని సంపాదించింది యాంకర్ రష్మి.. బుల్లితెరపై సుధీర్ తో కలిసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులను మైమరపించేలా చేస్తూ ఉంటుంది. ఇక అంతే కాకుండా వీరిద్దరి లవ్ వార్త గురించి ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులలో చర్చనీయాంశంగానే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ కనిపించారంటే చాలు నిజమైన ప్రేమ పక్షుల అంటారు . అలాగే ఎంతో వినోదాన్ని కూడా పంచుతూ ఉంటారు. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో.. వీరిద్దరికీ ఎన్నో సార్లు వివాహం అయినట్లుగా చూపించారు. అయితే అదంతా కేవలం స్క్రిప్టులో భాగమే అని చెప్పవచ్చు. ఇక ఇద్దరూ కలసి ఎన్నో డ్యూయెట్లు చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు.ఇక రష్మీ కూడా సుధీర్ పై తనదైన శైలిలో పంచులు వేస్తూ బాగా అలరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు జంతువుల పై ఉండే ప్రేమను కొన్ని సందర్భాలలో బయట పెడుతూ ఉంటుంది రష్మి. కరోనా సమయంలో.. మూగజీవాలకు భోజనం లేక అల్లాడుతుంటే వాటికి స్వయంగా రష్మీ నే ఆహారం అందించింది. ఇక జంతువులపై ఏదైనా హింసాత్మక సంఘటనలు జరిగితే వెంటనే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. గ్లామర్  విషయంలో చాలా కేర్ గా ఉంటుంది రష్మి. అప్పుడప్పుడు తన గ్లామర్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటుంది.తాజాగా సంక్రాంతి పండుగ వేళ కళ్ళకు ఉట్టిపడేలా కొన్ని ఫోటో షూట్ లను చేసి వాటిని షేర్ చేసింది. తను వేసుకున్న బ్లూ డ్రెస్ లో రష్మి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే లంగా వోని లో అందాలను ఒలకబోస్తూ ఉంది. ఇక తన నడుము అందాలతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది రష్మీ. అప్పుడప్పుడూ జబర్దస్త్ లో కూడా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. ఇక సుధీర్ తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడం వల్ల ఈమె పై పలు రూమర్స్ వస్తూనే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: