నాగార్జున, జగపతి బాబు, రమేష్ బాబు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ ముగ్గురు కూడా అటు సినీ బ్యాక్ గ్రౌండ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారే. నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఇప్పటికీ స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఇక జగపతిబాబు నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రమేష్ బాబు  ఇక మొదట్లో హీరోగా రాణించినప్పటికీ  ఆ తర్వాత కలిసి రాకపోవడంతో నిర్మాతగా అవతారమెత్తారు. ఇటీవలే హఠాత్ మరణం తో అభిమానులను విషాదంలో ముంచెత్తారు ఆయన.


 ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులుగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముగ్గురికి ఒక పోలిక ఉంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.  అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1986 లో నాగార్జున విక్రమ్ సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మించింది. హిందీ లో హీరో అనే సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. మంచి విజయం కూడా సాధించింది. హిందీ సినిమాలో హీరోగా నటించిన జాకీష్రాప్ కి కూడా ఈ సినిమా మొదటి సినిమా కావడం గమనార్హం. ఇక జగపతి బాబు విషయానికి వస్తే నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్  తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సింహస్వప్నం ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు జగపతిబాబు. ఇక ఈ సినిమాను స్వయంగా జగపతి బాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించడం  గమనార్హం. ఈ సినిమా కూడా హిందీ సినిమా కత్రోకీ కిలాడీ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు రమేష్ బాబు. కాగా రమేష్ బాబు హీరోగా పరిచయమైన సామ్రాట్ సినిమా కూడా హిందీలో సూపర్ హిట్టయిన బెతాబ్ మూవీ కి తెలుగు రీమేక్ కావడం గమనార్హం. ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించారు. ఇక మరో పోలిక ఏమిటంటే ఈ ముగ్గురు హీరోలు  అరంగేట్రం చేసిన మొదటి సినిమాకు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: