మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సినిమాలో చిరంజీవి మాస్ లుక్ తో కనిపిస్తారని టాక్. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటిస్తాడని టాక్. రవితేజ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న టైం లో అన్నయ్య సినిమాలో చిరుకి తమ్ముడిగా నటించాడు రవితేజ.

చిరుతో మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ సినిమా వస్తుంది. చిరు, బాబీ కాంబో సినిమాలో రవితేజ నటించేందుకు గాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. రవితేజసినిమా కోసం రోజుకి పాతిక లక్షల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు టాక్. రవితేజ పోర్షన్  వరకి ఒక వారం రోజుల షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తుంది.  

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ మల్టీస్టారర్ గా కె.ఎస్ బాబీ సినిమా వస్తుంది. ఈ సినిమాలో రవితేజ తన పాత్రతో సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. సినిమాని టర్న్ చేసే పాత్రలో మాస్ రాజా నటిస్తాడని టాక్. క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా చిరు సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నాడు. చిరు సినిమాలో రవితేజ అనగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగాయి. తప్పకుండా అప్పుడు బ్రదర్స్ గా అలరించిన చిరు, రవితేజ ఈసారి మరింత హంగామా చేస్తారని ఫిక్స్ అవ్వొచ్చు.  ఆల్రెడీ కె.ఎస్ రవీద్ర రవితేజతో పవర్ సినిమా చేశాడు. ఆ చనువుతోనే చిరు సినిమాలో ఆయన్ను రిపీట్ చేస్తున్నాడు. మెగా మాస్ మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు మాస్ ఆడియెన్స్ అందరిని అలరించే ఛాన్స్ ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: