అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమా తో తెలుగు ప్రెక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.. ఆ సినిమా తో నటనపై మంచి మార్కులు వేయించుకుంది.తర్వాత కొన్ని సినిమాల లో కనిపించినా పెద్దగా పేరు రాలేదు. అందానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.. ఈ సినిమా తర్వాత మరోసారి అక్కినేని హీరో సరసన నటించింది ఈ భామ. అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.


ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలొ రామ్ సరసన నటించింది. ఆ సినిమా భారీ హిట్ ను అందుకుంది. దీంతో అమ్మడు రేంజ్ అమాంతం పెరిగిపొయింది. మరో వైపు తమిళ్ లో కూడా సినిమాలు చెస్తుంది. అక్కడ కూడా వరుస హిట్ సినిమాలను తన ఖాతా లో వేసుకుంది. ఇక సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. తెలుగులో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో సినిమాలోనూ నిధి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు నిధి భారీగా రెమ్యునరేష్ అందుకుందని తెలుస్తుంది.


 నిధి అగర్వాల్ ఇప్పటి వరకు 50 లక్షల నుండి 80 లక్షల మద్య పారితోషికం తీసుకున్న అమ్మడు ఈ సినిమాకు ఏకంగా దాదాపు రెండు కోట్లు తీసుకుందనె వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అమ్మడు సినిమాల విషయాన్నికొస్తే.. ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తుంది.మరో వైపు బాలీవుడ్ నుంచి కూడా సినిమాలు లైన్ లో పెట్టాలని చూస్తుంది. తమిళ స్టార్ హీరో శింబు తో ప్రేమలో వున్నట్లు వార్తలు కూడా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.. మొత్తానికి నిధి కూడా భారీగా పెంచెసింది. పవన్ కళ్యాణ్ సినిమాకు ఎంత డిమాండ్ చెస్తుందొ తెలియాల్సి వుంది. ఆ సినిమా కూడా హిట్ అయితే మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: