ఇండస్ట్రీలో ఒక్కప్పుడు ఫ్యామిలీ హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతి బాబు. హీరోగా మంచి విజయాలను సొంతం చేసుకున్న ఆయన ఇండస్ట్రీకి కొంత విరామం ఇచ్చారు. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాతో విలన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమా నుండి వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో, విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు జగపతి బాబు.

ఇక ఎన్టీఆర్ జగపతి బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో, అరవింద సమేత సినిమాలు నటుడిగా జగపతి బాబుకు మంచి పేరు, గుర్తింపుని తీసుకొచ్చాయి. అయితే  నాన్నకు ప్రేమతో సినిమాలో క్లాస్ విలన్ గా నటించి మెప్పించిన జగపతి బాబు అరవింద సమేత వీరరాఘవ సినిమాలో మాస్ విలన్ గా ప్రేక్షకులను అలరించారు.

ప్రస్తుతం ఆయన విలన్ రోల్స్ లో నటించడానికి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.. అరవింద సమేత వీరరాఘవ సినిమాకు స్క్రిప్ట్ బాగా కుదిరిందని ఆ సినిమాలో నా పాత్ర ఎగ్రెసివ్ పాత్ర అని  చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తారక్ మాత్రం సినిమాలో కూల్ పాత్రలో కనిపించారని జగపతిబాబు వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో సిరెడ్డి పాత్రకు ఒప్పుకున్న తర్వాత తనకు తారక్ శిక్ష విధించాడని ఆయన పేర్కొన్నాడు.

అయితే అరవింద సమేత సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ బసిరెడ్డి పాత్ర చాలా బాగుందని చెబుతూ రకరకాలుగా తిట్టేవాడని జగపతి బాబు తెలిపారు. ఇక ఎన్టీఆర్ తనని ప్రేమగానే తిట్టేవాడని కోపంతో కాదని ఆయన వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఆ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ తనను దూరం పెడతానని చెప్పారని జగపతి బాబు తెలిపారు. అంతేకాక.. నాతోనే మీరు ఆడుకుంటున్నారని నాలుగైదు సంవత్సరాలు మీ ముఖం చూపించకండి అంటూ తారక్ సరదాగా అన్నారని ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: