కాకపోతే శృతిమించితే ఏ ఎమోషన్ అయినా యెబ్బెట్టుగా ఉంటుంది. ఇక్కడే డైరెక్టర్లు వారి టాలెంట్ చూపించి ఏది ఎక్కడ ఎంత రావాలో పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. కథను బట్టి సినిమాను మలుచుకుంటూ పోతారు. చెప్పాలంటే ఈ మద్య కాలంలో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు పెరుగుతున్నాయి. శృంగారం కంటెంట్ ఉన్న చిత్రాల వలన పెట్టుబడులు కూడా ఈజీగా వస్తుడటంతో దర్శక, నిర్మాతలు సైతం అడల్ట్ కంటెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. కనీసం లిప్ లాక్ అయినా ఉండేలా చూసుకుంటున్నారు.
కాగా శృంగారం రక్తి కట్టించిన ఓ సినిమాపై ఇపుడో లుక్కేద్దాం పదండి.
మొదటగా చెప్పాలంటే RX100
రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కార్తీకేయ, పాయల్ రాజ్పుత్ హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2018, జూలై 12న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యింది. పాయల్ కూడా ఏ మాత్రం దాచుకోకుండా గ్లామర్ పాత్రలో రెచ్చిపోయి నటించింది. స్ట్రాంగ్ కంటెంట్ కూడా తోడడవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ కలెక్షన్లు అందుకుంది.