ఈ సంక్రాంతికి అక్కినేని తండ్రికొడుకుల హంగామా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు కలిసి చేసిన బంగార్రాజు మూవీ ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఏపీ, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ వసూళ్లతో బంగార్రాజు దూసుకెళ్తున్నాడు. అక్కినేని హీరోల కెరియర్ లో చూడని మ్యాజిక్ కలక్షన్స్ ఫిగర్ ని ఈ సినిమా తెచ్చి పెడుతుంది. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా అక్కినేని హీరోల కెరియర్ లో వన్ ఆఫ్ ది క్రేజీ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది.

సంక్రాంతికి వస్తాయనుకున్న రెండు పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులు వాయిదా పడటం. ఇద్దరు యువ హీరోల తో నాగార్జున పోటీ పడటం తో నాగార్జున బంగార్రాజు కి చాలా ఈజీగా హిట్టు వచ్చేసిందని చెప్పొచ్చు. అయితే సినిమాలో కంటెంట్ లేకపోతే ఎన్ని సినిమాల్ వచ్చినా ఏ సినిమా లేకపోయినా ప్రేక్షకులు చూడరు. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ దగ్గర బీబహ్త్సాన్ని సృష్టిస్తుంది.

ఇదిలాఉంటే ఓ పక్క థియేటర్ లో సూపర్ గా రన్ అవుతున్న బంగార్రాజు సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు జీ స్టూడియోస్ అధినేతలు. బంగార్రాజు కి జీ స్టూడియోస్ కూడా నిరాణ సహకారం అందించారు. ఈ క్రమంలో జనవరి 26 తర్వాత జీ 5 ఓటీటీలో బంగార్రాజు డిజిటల్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఫిబ్రవరి 4న జీ 5లో బంగార్రాజు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తుండటంతో ఆ ఎఫెక్ట్ కలక్షన్స్ మీద పడ్డది. అందుకే బంగార్రాజుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఓటీటీలోకి వదలాలని అనుకుంటున్నారు. సూపర్ హిట్ టాక్ వచ్చి రెండు మూడు వారాలకే బంగార్రాజు ఓటీటీలో రావడం అక్కినేని ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: