శివ కార్తికేయన్ కోలీవుడ్‌లో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. 'డాక్టర్' సినిమా వంద కోట్ల వరకు కలెక్ట్ చేయడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. సినిమాకి 30 కోట్లకి పైగా చార్జ్ చేస్తున్నాడు. ఈ ఫిగర్‌ని మరింత పెంచుకోవడానికి మార్కెట్‌ని విస్తరించుకుంటున్నాడు. తెలుగులో అనుదీప్ కె.వి. దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 'జాతిరత్నాలు' హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న అనుదీప్‌తో శివకార్తికేయన్ చేస్తోన్న సినిమా బైలింగ్వల్‌గా రాబోతోంది. విజయ్ తమిళ్లో టాప్ హీరో. వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కానీ మరో మార్కెట్లో పెద్దగా స్టార్డమ్ లేదు. తెలుగులో 20 కోట్ల మార్క్ దాటడానికి కూడా కష్టపడుతున్నాడు. అయితే తీసుకుంటోన్న రెమ్యూనరేషన్‌కి న్యాయం చేయడానికి మార్కెట్ విస్తరణపై ఫోకస్ పెట్టాడు. తెలుగులో ఫాలోయింగ్ పెంచుకోవడానికి తెలుగు డైరెక్టర్‌తోనే సినిమా చేస్తున్నాడు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెలుగు, తమిళ్ బైలింగ్వల్‌గా రూపొందుతోందీ సినిమా. కమర్షియల్ ఎంటర్టైనర్స్ని ఫుల్ రిచ్‌గా తీసే వంశీ పైడిపల్లి ఈ సినిమాని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నాడట. హిందీ బెల్ట్‌లో తెలుగు సినిమాలకి డిమాండ్ పెరుగుతోంది. మాస్ మూవీస్‌కి భారీ వసూళ్లు వస్తున్నాయి. దీంతో తమిళ స్టార్లు కూడా తెలుగు మేకర్స్‌తో సినిమాలు చెయ్యడానికి పోటీ పడుతున్నారు. పైగా టాలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తే, తెలుగులో మార్కెట్ కూడా పెరుగుతుంది. అందుకే తమిళ్ స్టార్స్ అంతా హైదరాబాద్‌లో లాండ్ అవుతున్నారు. 'బంగార్రాజు'తో సంక్రాంతికి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు కళ్యాణ్ క్రిష్ణ. 'సోగ్గాడే చిన్ని నాయనా' తర్వాత 'నేలటిక్కెట్టు'తో మధ్యలో కొంచెం డల్ అయిన ఈ దర్శకుడు మళ్లీ 'బంగార్రాజు'తో ఓకే అనిపించుకున్నాడు. అలాగే ఇప్పుడు తమిళ మార్కెట్లోనూ అడుగుపెడుతున్నాడు. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో కళ్యాణ్ క్రిష్ణ ఒక బైలింగ్వల్‌కి సైన్ చేశాడు.