తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముందు హీరోయిన్ గా వచ్చి.. ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు ప్రస్తుతం.. అలాంటి వారిలో అపూర్వ కూడా ఒకరు. ఈమె మొదట హీరోయిన్ గా వచ్చి.. 2002వ సంవత్సరంలో అల్లరి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ కి తల్లిగా నటించింది ఈమె..ఈ సినిమాతో ఈమెకు ఆంటీ అనే ముద్ర కూడా పడిపోయింది. ఎప్పుడైనా ఇలా ఎందుకు నటించానని అనిపించిందని ఒక ఇంటర్వ్యూలో అడగగా.. నటి అపూర్వ తెలిపిన సమాధానం ఇది.

అపూర్వ మాట్లాడుతూ.. అల్లరి సినిమా షూటింగ్ టైంలో నేను బాగా ఏడ్చేదాన్ని.. ఎందుకంటే అంతకు ముందు నేను హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి వచ్చాను.. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ పక్కింటి ఆత్త గా నటించాల్సి వచ్చింది.. షూటింగ్ జరిగేటప్పుడు ప్రతిరోజు ఏడ్చేదాన్ని అని తెలిపింది.. అప్పుడు అల్లరి నరేష్ ఏజ్ 17 సంవత్సరాలు.. ఉంటాయి. నాకు ఒక 21 ఏళ్ళు ఉంటాయి.. కానీ నేను అప్పటి వరకు హీరోయిన్ గా చేసి వచ్చానా.. హీరోయిన్ అనే భ్రమలో నేను ఉండిపోయాను.. అలాంటిది ఒక అమ్మ పాత్రలో అంటే... షూటింగ్ సమయాలలో తెగ ఏడ్చేదాన్ని అని తెలియజేసింది.కానీ తన మనసులో మాత్రం ఇది చిన్న సినిమానే.. నేను పెద్దగా కనిపించనని అనుకున్నానని తెలియజేసింది. కానీ ఆ సినిమా హిట్ కొట్టడంతో.. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అదే అని తెలియజేసింది. అప్పుడు బాధపడినప్పటికి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని తెలియజేస్తుంది. ఇక సినిమాలో నాది మిడిల్ ఏజ్ ఆంటీ క్యారెక్టర్ అని తెలియజేసింది. అయితే అల్లరి సినిమా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు.. తన ఆల్బమ్ తీసుకొని వెళ్లిందట అపూర్వ..ఆ సమయంలో రవిబాబు.. తన తండ్రి తో ఇలా అన్నాడట. మీరేమో ఆంటీ క్యారెక్టర్ అని అన్నారు కానీ..ఆవిడేమో హీరోయిన్ ఆల్బమ్ పట్టుకొని వచ్చింది అని తెలియజేశాడట. సినిమాలో నటించడానికి చాలా ఒప్పించారని తెలియజేసింది అపూర్వ. అంతే కాకుండా ఆ సినిమా సమయంలో డైరెక్టర్ రవి నామీద చాలా కేర్ తీసుకున్నాడని తెలియజేసింది అపూర్వ. అందుచేతనే అప్పటి నుంచి నాకు చలపతి బాబాయ్ బాగా పరిచయం అయ్యారని తెలియజేసింది అపూర్వ.

మరింత సమాచారం తెలుసుకోండి: