వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎఫ్ త్రీ,  ఈ సినిమా 2019 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఎఫ్ టు  సినిమాకు ఫ్రాంచైజీ గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాను మొదట ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది, కాకపోతే దేశంలో కరోనా ప్రభావం వల్ల ఈ సినిమా ఆగస్టులో విడుదల కాలేదు. అయితే ఆ తర్వాత ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్ సినిమాను కూడా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఈ సినిమా ఫిబ్రవరి నుండి తప్పుకొని ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎఫ్ త్రీ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాక విడుదల తేది ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. 

  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఆ సమయంలో విడుదలయ్యే సినిమాలన్నీ దాదాపుగా వాయిదా పడ్డాయి. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమాను వాయిదా వేశారు, ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18 వ తేదీన లేదా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. అయితే ఒకవేళ ఏప్రిల్ 28 వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేసినట్లు అయితే మరొకసారి కూడా  ఎఫ్ త్రీ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: