సినిమా ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్ లకు మధ్య వయస్సు తేడా ఉండడం అనేది చాలా సాధారణమైన విషయం,  అలాగే తెలుగు సినిమాలలో కూడా ఎంతోమంది హీరోలకు, హీరోయిన్ లకు మధ్య చాలా వయస్సు తేడా ఉన్నప్పటికీ వారు సినిమాలలో కలిసి నటించి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు, అలా వారి కంటే ఎక్కువ వయసున్న హీరోలతో నటించిన కొంతమంది హీరోయిన్ ల గురించి తెలుసుకుందాం...

మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు, ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది, ఆ సినిమా సమయానికి మహేష్ బాబు, రష్మిక మందన కు  21 సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

నాగార్జున హీరోగా నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా గ్రీకు వీరుడు, ఈ మూవీ సమయానికి నాగార్జున కు, నయనతార కు మధ్య ఇరవై ఐదు సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

వెంకటేష్, అంజలి హీరో, హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఈ సినిమా సమయానికి వీరిద్దరి మధ్య 26 సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మహేష్ బాబు కూడా హీరోగా నటించాడు ఈ సినిమా బాక్స్ నాకు దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా డిస్కో రాజా, ఈ మూవీ లో నబా నాటేష్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా సమయానికి వీరిద్దరి మధ్య 27 సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ నటించిన సినిమా అఖండ , ఈ మూవీ సమయానికి ఈ ఇద్దరు మధ్య 31 సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది.

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కలిసి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా సమయానికి వీరిద్దరి మధ్య  ముప్పై నాలుగు సంవత్సరాల వయసు తేడా ఉంది, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: