టాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2016 టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా '24'. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సమంత హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో హీరోగా, విలన్ గా రెండు పాత్రల్లో మెప్పించాడు సూర్య. తెలుగు తో పాటు తమిళంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పాలి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఇండియా లో వచ్చిన సినిమాలలో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విజయం అనుకున్నప్పుడే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాకి సీక్వెల్ తీసే ప్లాన్ ఉందని చెప్పడం జరిగింది.

ఈ క్రమంలోనే తాజాగా 24 సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ఆకాశం నీ హద్దురా, జై భీం లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఫామ్ ని ఇలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు ఈ తమిళ హీరో. ఇక తాజాగా సూర్య నటించిన 'ఈటి' సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఇప్పటికే 24 సీక్వెల్ కి కథ కూడా రెడీ చేసినట్లుగా సమాచారం. ఇక హీరో సూర్య కి ఒకసారి కథ చెప్పి ఓకే చేస్తే త్వరలోనే 24 సీక్వెల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

ఇక 24 సినిమా సీక్వెల్ తో మరోసారి డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ సూర్య కలిసి వెండితెరపై అద్భుత సూత్రం ఖాయం అని అంటున్నాయి సినీవర్గాలు. మరోవైపు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'థాంక్యూ' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య జోడీగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చైతన్యను సూపర్ స్టార్ మహేష్ బాబు కి వీరాభిమాని గా చూపిస్తున్నాడు దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: