టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతో మంది యువ హీరోలు తమ సత్తా చాటుతూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు. ఈ రోజుల్లో వారసులు అలాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే హీరోలు అనే తేడా లేకుండా ప్రేక్షకులు కథ బాగుంటే ఆ కథకు తగ్గ పెర్ఫార్మన్స్ హీరో చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆ సినిమా ను ఆదరిస్తున్నారు. ఈ విధంగా ప్రేక్షకుల్లో ఇప్పుడు చాలామంది యంగ్ హీరోలు మంచి పేరు సంపాదించుకుంటూ వెళుతుండగా ఇంకా కొంతమంది ఒకే రకమైన మూస సినిమాలు చేయడం ప్రేక్షకులను చికాకు పెట్టిస్తుంది. ఏ మాత్రం కొత్తదనం లేని సినిమాలు చేయడం నిజంగా ఎవరికైనా నిరాశే మీగిలిస్తుంది.

ఆ విధంగా తెలుగు సినిమాలలో సరికొత్త కథలను వినూత్నమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న హీరో శ్రీ విష్ణు. ఇప్పుడు ఆయన భారీగా తన సినిమాలను ఫ్లాప్ చేసుకుంటూ ఉండడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఆయన నటించిన సినిమాలలో చాలా వరకు ఎంతో వైవిధ్యంతో కూడిన సినిమాలే ఉన్నాయి. అలాంటిది ఈ హీరో సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోవడం ఒక్కసారిగా అందరినీ నిరాశపరుస్తుంది. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న భళా తందనానా  అనే సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాగా దానిపై నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.

వినోదమైన టైటిల్స్ పెట్టి సినిమాలు చేయడం మాత్రమే కాదు ఆ సినిమాలను ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయాలి అని ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పై కామెంట్ల రూపంలో ఆయనకు వెల్లడిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయన చేసే చిత్రాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించకపోవడమే ఈ రకమైన కామెంట్లు రావడానికి ముఖ్య కారణం అని చెబుతున్నారు. అంతేకాదు అయన గత సినిమాల లాగానే ఈ సినిమా టీజర్ ఉండడంతో అందరు ఈ విధంగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఏదేమైనా శ్రీ విష్ణు ఒకప్పుడు చేసిన లైన్ లో ఇప్పుడు సినిమాలు ఆసక్తి కరంగా చేయడం లేదనే చెప్పాలి. మరి ఇప్పటికైనా అభిమానులు సూచించిన విధంగా మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను అలరిస్తాడా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: