ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంచెం బిజీ గా ఉంది. ఈ సినిమా విడుదల మొదట సంక్రాంతికి అనుకోగా ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 25 కు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ చివరికి ఏప్రిల్ 28 కి వాయిదా పడింది. ఇపుడు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎఫ్ 3 సినిమా ఎలా ఉండబోతున్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఎఫ్ 2 బిగ్గెస్ట్ హిట్ అందించగా ఇపుడు ఎఫ్ 3 ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఎఫ్ 2 కి మించిన ఫన్ ని మన ముందుకు తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు టీం మెంబెర్స్.
ఇక ఈ చిత్రం లో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జంటగా మెహ్రీన్ లే నటిస్తున్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపుడికి కూడా ఎఫ్ 3 మూవీ సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ డైరెక్టర్ కి అయిదు సక్సెస్ లు చేతిలో ఉండగా ఇపుడు ఎఫ్3 తో డబుల్ హ్యాట్రిక్ ను అందుకోవాలని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎఫ్ 2 మూవీ రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను రాబట్టి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి ఇపుడు అదే తరహాలో ఎఫ్ 3 కూడా ఫలితాన్ని అందుకుంటుంది ఆశిస్తున్న నేపథ్యం లో ఏమౌతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి