టాలీవుడ్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా బాలయ్యకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలయ్య సినిమా వస్తుందంటే చాలు ఆ రోజు పెద్ద పండుగగా భావిస్తారు అభిమానులు. అయితే ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను కొల్లగొట్టింది. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి భారీ రికార్డు నెలకొల్పింది. బాలకృష్ణ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా అఖండ నిలిచింది.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాతో బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ పడింది. ఇక ఈ సినిమా సంచలన విజయం అందుకోవడంతో అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని తన హోటల్ కి ఏకంగా 'అఖండ' అనే పేరు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ అభిమాని తన సోషల్ మీడియాలో ఈ ఫోటోని షేర్ చేస్తూ.. 'బాలయ్య మీద అభిమానం అంటే ఇది' అంటూ క్యాప్షన్ జోడించాడు.

దీంతో ప్రస్తుతం ఆ అభిమాని చేసిన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతోంది. ఇక ఈ పోస్టు చూసిన బాలయ్య అభిమానులు అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య ట్రాక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తన 107 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: