జూ.ఎన్టీఆర్‌ 'ఆర్ ఆర్ ఆర్'తో ముంబయికి వెళ్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో లార్జ్‌స్కేల్‌లో రూపొందిన ఈ సినిమాతో పాన్‌ ఇండియన్‌ స్టార్ ఇమేజ్‌ వస్తుందని డిసైడ్ అయ్యాడు. ఈ లెక్కలతోనే కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియన్‌ మూవీకి సైన్ చేశాడు. ఇక ఈ సినిమాకి నార్త్‌లో బజ్‌ పెంచడానికి బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ని తీసుకున్నారు. రామ్ చరణ్, శంకర్ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే ఆడియన్స్‌లో బజ్ పెంచింది. అయితే తెలుగు మార్కెట్‌తో పాటు హిందీలోనూ ఆసక్తి పెంచడానికి లాంచింగ్‌కి రణ్‌వీర్‌ సింగ్‌ని తీసుకొచ్చారు. ఇక హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకున్నారు. 'కభీర్‌సింగ్' హిట్‌తో కియారాకి నార్త్‌లో మంచి గుర్తింపు వచ్చింది. ఇంతకుముందు చరణ్, కియారా ఇద్దరూ కలిసి 'వినయవిధేయరామ' చేశారు.

విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో బైలింగ్వల్‌గా తెరకెక్కుతోందీ సినిమా. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో స్లమ్‌డాగ్‌ బాక్సర్‌గా నటిస్తున్నాడు నటిస్తున్నాడు విజయ్. ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ అనన్యాపాండే హీరోయిన్‌గా చేస్తోంది. బాక్సింగ్‌ లెజెండ్ మైక్‌ టైసన్‌ కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. టాలీవుడ్‌కి ముంబాయి నుంచి హీరోయిన్లు చాలా సంవత్సరాలుగా వస్తున్నారు. అయితే అప్పట్లో హిందీలో పెద్దగా స్టార్డమ్‌ లేనివాళ్లే తెలుగు సినిమాలు చేసేవాళ్లు. ప్రభాస్, నాగ్ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఒక సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతోంది. 'ప్రాజెక్ట్-కె' పేరుతో వస్తోన్న ఈ సినిమాని వరల్డ్‌ క్లాస్‌ పిక్చర్‌గా తెరకెక్కిస్తున్నామని చెప్పాడు నిర్మాత అశ్వనీ దత్. ఇక లార్జ్‌ స్కేల్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ని కీ-రోల్‌ ప్లే చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో 'హరి హర వీరమల్లు' అనే పీరియాడికల్ డ్రామా రూపొందుతోంది. ఔరంగజేబు కాలంనాటి కథాంశంగా రూపొందుతోన్న ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవల్‌లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు మేకర్స్. అందుకే విలన్‌గా అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు. నర్గీస్‌ ఫక్రీతో సెకండ్ హీరోయిన్‌ రోల్ చేయిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: