పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, కాకపోతే పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు.  ఆ తర్వాత మళ్ళీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన గాని లేక ఏప్రిల్ ఒకటోవ తేదీన గాని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పైగా పూర్తయినట్లు తెలుస్తోంది,  ఇది ఇలా ఉంటే మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్,  హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా నటించబోతున్నాడు, ఇదివరకే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.  ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వారికే ఒక బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో భవదీయుడు భగత్ సింగ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి,  ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ 'ఖిలాడి'  సినిమా దర్శక నిర్మాతలతో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి,  ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: