టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్
హీరోయిన్ గా ఉన్న
రష్మిక మందన
రామ్ చరణ్ సినిమాలో నటించడానికి కొన్ని కండిషన్ లు పెట్టడం ఇప్పుడు అంతా చర్చనీయాంశం అయింది.
టాలీవుడ్ లోనే అతి పెద్ద
హీరో గా ఉన్న
రామ్ చరణ్ సినిమాలో నటించడానికి కండిషన్స్ ఏంటి అని అందరూ మాట్లాడుకుంటుండగా
రష్మిక మందన ఈ విధమైన కండిషన్స్ పెట్టడం ఎలాంటి అర్థం ఉందో తెలియదు కానీ మెగా అభిమానులు మాత్రం ఈమెపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
సినిమా పరిశ్రమలోకి చిన్న సినిమాల ద్వారా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెద్ద హీరోల సరసన సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. ఇటీవల ఆమె పుష్ప లో సినిమాల్లో నటించగా ఆ
సినిమా ద్వారా ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ గుర్తింపు ను బాలీవుడ్లో సైతం ఉపయోగించుకునేలా ఆమె ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. అయితే తెలుగు హీరోల సరసన నటించే విషయం లో మాత్రం ఆమె కొన్ని కండిషన్లు పెడుతోందట. ఆ కండిషన్లు ఒప్పుకుంటేనే సదరు హీరోతో ఆమె నటించే విధంగా ముందుకు వెళుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
సినిమాలో తనే సోలో
హీరోయిన్ గా ఉండాలి అనేది
రష్మిక మొదటి కండిషన్. ఆ తర్వాత శృంగార సన్నివేశాలు ఎక్కువగా పెట్టకూడదని అవసరమైతేనే ముద్దు సీన్లు పెట్టాలని ఆమె కండీషన్లు పెడుతుందట. అంతేకాదు డేట్లు కూడా తన సమయానుకూలంగా నే పెట్టాలని ఆమె సదరు దర్శక నిర్మాతలకు సూచిస్తుందట దీంతో ఆమె
రామ్ చరణ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం
శంకర్ చిత్ర బృందం సంప్రదించగా ఆమె ఈ విధమైన కండిషన్లు చెప్పిందట. దాంతో మెగా అభిమానులు ఆమె కాకపోతే వేరే
హీరోయిన్ లేదా అని ఆమెకు భారీ స్థాయిలో సమాధానాలు చెబుతున్నారు. మరి
రష్మిక మందన ఈ విధమైన బిహేవియర్ తో ముందుకు వెళితే మాత్రం తప్పకుండా భవిష్యత్తులో ఇబ్బందులు పడుతుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ కండిషన్ ల లో మార్పులు చేసుకుంతుందా అనేది చూడాలి.