వర్మ ఏ విషయం తెలియజేసిన ఆ విషయం గురించి నలుగురు మాట్లాడుకునేలా చేస్తూ ఉండేలా చేస్తాడు అని చెప్పవచ్చు.. అది సినిమా అయినా సరే ,తను చేసే ట్వీట్ అయిన సరే, స్పీచ్ ఐనా సరే తనదైన శైలిలో స్పందిస్తూ నిరంతరము వార్తలు లోనే ఉంటూ ఉంటారు. వర్మ తాజాగా తన ట్విట్టర్ నుంచి ఒక కొటేషన్ ని షేర్ చేయడం జరిగింది.. ప్రతిసారి కష్టపడే వాడు కూలివాడు అవుతాడు.. అసలేం కష్టపడకుండా ఆ కూలి అతనితో తక్కువ డబ్బులు కి పని చేయించుకుని వాడు మాత్రం ధనికుడు అవుతాడు అంటూ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది.
ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది. ఇక వర్మ చేసిన ఈ కొటేషన్ పై.. నెటిజన్లు కూడా తిరిగి కౌంటర్లు ఇవ్వడం జరుగుతోంది.. మరికొందరు ఏకంగా కూలి వాళ్ళు లేకుండా ధనవంతుడు ఎవరు కాలేరని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. దీంతో ఇది కాస్త మరొకసారి వర్మనే చిక్కుల్లో పడేసిందని చెప్పవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి