దేశ వ్యాప్తంగా ఇప్పుడు పుష్ప సినిమా గురించి జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా అల్లు అర్జున్ కు భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. కూలీ గా జీవితాన్ని ప్రారంభించిన హీరో ఏ విధంగా స్మగ్లింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ

ఆ విధంగా ఈ చిత్రంలోని హీరో పాత్రను ఎంతో వెరైటీగా డిజైన్ చేసి దానికి తగ్గట్లుగా అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేలా చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా యొక్క క్రేజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. విదేశీయులు సైతం ఈ సినిమాలోని డైలాగులు చెబుతూ పాటలకు స్టెప్ లు వేస్తూ సినిమా యొక్క క్రేజ్ ను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మన తెలుగు హీరోలలో ఎంతో మార్పును తీసుకు వచ్చిందట. ఇప్పటివరకు చేసిన సినిమాలను పక్కన పెడితే భవిష్యత్తులో చేయబోయే సినిమాలు పుష్ప సినిమా స్థాయిలో ఉండాలని వారు భావిస్తున్నారట. 

పుష్ప సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులకు ఎంత బాగా రీచ్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి తరహా చిత్రాలు రావడానికి ఇప్పుడు సన్నాహాలు మొదలయ్యాయి. అందరు హీరోలు కూడా ఈ విధమైన సినిమాలను తీసుకురావాలని సదరు దర్శక నిర్మాతలకు సలహాలు సూచనలు చేస్తున్నారట. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వకపోయి ఉంటే వారు ఈ రకంగా ఈ రకమైన సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతారు. మరి అందరికీ ఈ విధమైన సినిమాలు చేయడం సాధ్యం కాదు కాబట్టి పుష్ప లాంటి సినిమాలు ఎలా వస్తాయి అనేది చూడాలి. ఇకపోతే సుకుమార్ తన తదుపరి సినిమా విజయ్ దేవరకొండ తో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: