తమిళ స్టార్ హీరో సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే ఈ క్రమంలోని సూర్య తమిళంలో నటించిన సినిమాలు తప్పనిసరిగా తెలుగులో కూడా డబ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తాయి.ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా నటించిన ఈటీ అనే చిత్రం ద్వారా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలోనే సూర్యసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సూర్యసినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

ఇకపోతే ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ఈ సినిమా "లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాలో సామాజిక సందేశం ఉంది. అంతేకాదు దర్శకుడు ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు.ఇకపోతే  ఈ సినిమా ద్వారా మొట్ట మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పడం తనకు చాలా సంతోషంగా ఉందని సూర్య వెల్లడించారు. అయితే ఈ సినిమాలో తనతో పోటీ పడటానికి విలన్ పాత్రలో వినయ్ రాయ్ నటించారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో పాండిరాజ్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. 

కాగా టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలలో విలన్ పాత్రలను ఎంతో శక్తివంతంగా డిజైన్ చేస్తారంటూ రాజమౌళి సినిమాల పై ప్రశంసలు కురిపించారు.అయితే  దర్శకుడు పాండిరాజ్ కూడా అదే తరహాలోనే ఈ సినిమాలో వినయ్ రాయ్ పాత్రను డిజైన్ చేశారని ..అంతేకాకుండా ఈ సినిమా కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడినీ ఎంతగానో ఆకట్టుకుంటుందని సూర్య తెలియజేశారు. ఇక త్వరలోనే సూర్య టాలీవుడ్లో స్ట్రైట్గా తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా ఆ ప్రాజెక్టుని చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించే చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: