సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.. ఇక ఈ ఫ్యామిలీ లో మంచు లక్ష్మి చేసే అల్లరి అంతా ఇంతా ఉండదు.. అయితే అలాంటి మంచు లక్ష్మి తాజాగా కొన్ని విషయాలను తెలియజేసింది. తాను ఎదుర్కొన్న బాడి షేమింగ్స్, క్యాస్టింగ్ కౌచ్, ట్రోల్స్ వంటివాటిపై.. తాజాగా మాట్లాడడం జరిగింది.. నిన్నటి రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మీడియాతో మంచులక్ష్మి ఈ విషయాలను తెలుపుకు వచ్చింది. తన కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటున్నట్లుగా ఆమె తెలుపుతోంది.

మోహన్ బాబు కూతురు ని.. సినిమా ప్రపంచంలోని పుట్టాను, పెరిగాను కదా..? క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎందుకు ఉంటుంది అని అనుకున్నదట. కానీ ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ ఇండస్ట్రీలోనూ, ప్రతిరంగంలోనూ ఉంటోంది. బ్యాంకింగ్, ఐటి , వంటి రంగాలలో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని మంచు లక్ష్మి చెప్పి అందరికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. తన స్నేహితులు ఎందరో వాటిగురించి చెబుతూ ఉంటారు అని తెలిపింది. ఇక బాడీ షేవింగ్, ట్రోల్స్ మాత్రం అందరికీ ఎదురవుతాయని ఎలా ఉన్నా కూడా వారిని ట్రోల్ చేస్తారని తెలుపుకు వచ్చింది. వాటన్నిటి పట్టించుకోకుండా మనం మనకు నచ్చినట్టుగా ఉండాలని  తెలిపింది.


అసలే ఇది చాలా చిన్న జీవితం.. మనం అనుకున్నవన్నీ చేసేయాలి, కోరుకున్నది సాధించుకోవడానికి చాలా కష్టపడాలి వాటితోపాటు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ చెప్పడం కష్టమే.. కానీ ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనేవి కూడా మనల్ని ఆపకూడదు. మనం ఏం చేయాలి అనుకున్నమో అది చేయాలి. సాధించాలి అనుకున్న అది మాత్రం సాధించాలని తెలిపింది మంచు లక్ష్మి.. ప్రస్తుతం మంచు లక్ష్మి తమిళం మలయాళంలో కూడా నటిస్తున్నది. మోహన్ లాల్ తో కూడా ఒక సినిమాలో నటిస్తుంది. మరొక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: