ఆమె మరెవ్వరో కాదు యంగ్ హీరోయిన్ రిద్ధి కుమార్. ఈమె పూణే కు చెందిన మోడల్. మోడలింగ్ నుంచి సినిమాల వైపు వచ్చింది. అయితే ఆమె పేరు చాలామందికి తెలియదు. ఆమె నటించిన సినిమాలు కూడ బాగా తక్కువ. తెలుగులో ఆమె రాజ్ తరుణ్ పక్కన ‘లవర్’ మూవీలో నటించింది. అయితే ఆసినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిందో కూడా సగటు ప్రేక్షకుడుకి కూడ తెలియదు.
ప్రస్తుతం ఈమె 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ తో కలిసి నటించడం చాలా గొప్పగా అనిపించిందని చెబుతూ ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో తాను ‘తార’ అనే పాత్రలో కనిపిస్తానని ఆపాత్ర ఈమూవీకి చాల కీలకం అని అంటోంది. మంచి అందమైన లుక్ తో కనిపిస్తూ తాను గ్లామర్ పాత్రలకు రెడీ అన్న సంకేతాలు ఇస్తోంది.
ఈమూవీ ప్రమోషన్ లో తెగ సందడి చేస్తూ ఈమె సోషల్ మీడియాలో కూడా చాల హడావిడి చేస్తోంది. దీనితో ప్రభాస్ అభిమానులు అంతా ఈమె ఎవరు అంటూ గూగుల్ తెగ సెర్చ్ చేస్తున్నారు. వాస్తవానికి ఒక పాన్ ఇండియా మూవీలో ఇలాంటి కొత్తవారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వరు. దీనితో ఈమెకు ప్రభాస్ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అంటూ ఆశ్చర్య పోతున్నారు. ఈమూవీ హిట్ అయితే ఈమె కు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈమూవీలో ప్రతి చిన్న పాత్రకు ఎదో ఒక ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి