అందాల ముద్దుగుమ్మ శ్రేయ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  అందాల ముద్దుగుమ్మ శ్రియ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో హిట్,  సూపర్ హిట్,  బ్లాక్ బస్టర్ సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో కాలం పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన శ్రియ కొంత కాలం క్రితం ఆండ్రూ కొశ్చివ్ అనే రష్యన్‌ వ్యక్తి ని వివాహం చేసుకుని ఇండస్ట్రీ కి దూరమైంది,  ఇలా వివాహం తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయిన శ్రియ ప్రస్తుతం మళ్ళీ సినిమా లతో ఫుల్ బిజీ అయిపోయింది.

 శ్రేయ ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది,  ఈ మూవీ మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  ఈ మూవీ తో పాటు దృశ్యం హిందీ రీమేక్ లో కూడా అజయ్ దేవగన్ సరసన శ్రియ నటిస్తోంది,  ఇది ఇలా ఉంటే శ్రేయ మరో భారీ ప్రాజెక్ట్ లో నటించడానికి అంగీకరించింది,  ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ ఏడు భాషల్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు,  ఈ మూవీ ని 1970 బ్యాక్‌ డ్రాప్‌ లో మాస్‌ యాక్షన్‌ మూవీగా రూపొందిస్తున్నట్లు సమాచారం.  కన్నడ నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌ కథానాయకులుగా నటించే ఈ మూవీ లో శ్రియ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది,  ఇలా పెళ్లి తర్వాత వరుస సినిమా ఆఫర్ లతో శ్రేయ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: