ఈమూవీలోని పాటలను ఇమిటేట్ చేస్తూ అనేకమంది క్రికెటర్స్ మాత్రమే కాకుండా ఈమూవీలోని డైలాగ్స్ ను ఈమధ్యనే జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడ ఉపయోగించు కోవడం ఈమూవీకి బాలీవుడ్ ఏర్పడిన మ్యానియాను సూచిస్తోంది. ఈ మూవీ నార్త్ లో సాధించిన కలక్షన్స్ చూసి బాలీవుడ్ టాప్ హీరోలు కూడ ఆశ్చర్యపోతున్నారు.
బాలీవుడ్ లో ఏ సినిమా ప్రమోషన్ ఫంక్షన్స్ జరిగినా ‘పుష్ప’ మ్యానియా గురించి మీడియా వర్గాల నుండి బాలీవుడ్ హీరోలకు ప్రశ్నలు ఎదురౌతున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన ‘బచ్చన్ పాండే’ ప్రెస్ మీట్ లో కూడ ‘పుష్ప’ కు సంబంధించిన ప్రశ్నలు అక్షయ్ కుమార్ కు ఎదురయ్యాయి. తమిళ హిట్ చిత్రం 'జిగర్తాండ' ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈమూవీ మార్చి 18న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో జరిగిన ఒక మీడియా మీట్ లో ఒక మీడియా ప్రతినిధి ‘పుష్ప’ మ్యానియా పై మీ స్పందన ఏమిటి అంటూ అక్షయ్ కుమార్ ను ప్రశ్నించాడు.
ఈసినిమా బాగుందని అక్షయ్ సమాధానం ఇచ్చాడు. అయితే అలాంటి సినిమాలు బాలీవుడ్ లో ఎందుకు రావడం లేదు అంటూ మరొక ప్రశ్న ఎదురు కావడంతో కొంత అసహనానికి లోనైన అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో చాల మంచి సినిమాలు వస్తున్నాయని ఈమధ్య విడుదలైన ‘గంగుభాయ్ కతియావాడి’ మంచి సినిమానే కదా అంటూ సమాధానం ఇవ్వడమే కాకుండా దక్షిణాది సినిమాలలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయని బాలీవుడ్ లో మాత్రం చాలామంది దర్శకులు మంచి సినిమాలు తీయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసాడు. దీనితో ‘పుష్ప’ మూవీ పై అక్షయ్ కుమార్ కు అంత కోపం ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ చేసినట్లు టాక్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి