ఇక బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు సుపరిచితురాలు అయ్యింది. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ లలో మొదటి వరుసలో ఈమె ఉంటుంది అనడం లో అసలు ఎలాంటి సందేహం లేదు.ఇక సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న విద్యా బాలన్ ఇప్పటికి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా లతో బాగా దూసుకు వెళుతోంది. ఒకానొక సమయంలో ఈమె చాలా లావు అయినప్పటికి ఏమాత్రం అసలు తన ఆత్మ విశ్వాసం కోల్పోకుండా సినిమాల్లో నటిస్తూనే వచ్చింది.కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆమె బరువు పెరగడం పెరిగినా కూడా ఆ ఇబ్బందిని ఎప్పుడూ కూడా లోపంగా చూడలేదు.ఇక  తన ఫిజిక్ కి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చింది విద్యాబాలన్. తాజాగా ఈమె నటించిన సినిమా జల్సా  అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధమైంది. 


ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో విద్యా బాలన్  మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది.ఇక సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నం చేస్తున్న సమయం లోనే ఒక నిర్మాత తనను అత్యంత దారుణంగా అవమానించాడని చెప్పింది. ఇక ఆయన మాటలు విన్న తర్వాత నేను ఆరు నెలల పాటు కనీసం అద్దం లో నన్ను నేను చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని అని చెప్పింది.ఇక ఆయన మాటలు అంతగా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీశాయని విద్యా బాలన్ చెప్పింది.ఇంకా అలాగే పలువురు నిర్మాతలు కూడా తనను తీవ్రంగా అవమానించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఒకప్పుడు తనతో సినిమాలు చేస్తామని ఆ తర్వాత వద్దన్న నిర్మాతలు ఇప్పుడు తనతో సినిమాలు చేసేందుకు డేట్లు కావాలని ఫోన్లు చేస్తూ ఉంటారని ఇక వారందరిని కూడా నేను తిరస్కరించానని చెప్పుకొచ్చింది విద్యాబాలన్.

మరింత సమాచారం తెలుసుకోండి: