పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరని అందరికి తెలుసు..ఏపీలో తక్కువ టికెట్ రేట్లు అమలవుతున్నాకూడా భీమ్లా నాయక్ సినిమా బాగానే కలెక్షన్లను సాధిస్తోంది.


పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా మరోవైపు రాజకీయాల్లో కూడాఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. 2024 సంవత్సరంలో ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తుండటం విశేషం. ఇటీవల జనసేన 9వ ఆవిర్భావ సభ జరగగా ఈ సభకు లక్షల సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చారనే విషయం తెలిసిందే.


 


అయితే ఈ సభలో మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ ధరించిన ఉంగరం బాగా హైలెట్  అయింది. పవన్ కళ్యాణ్ ధరించిన ఉంగరం పగడపు ఉంగరం అని తెలుస్తుంది.. జాతకంలోని దోషాలు తొలగిపోవడానికి సాధారణంగా ఇలాంటి ఉంగరాలను ధరించడం జరుగుతుందట.. పవన్ దేవుళ్లను  బాగా నమ్ముతారు. ఆచారసాంప్రదాయాలకు పవన్ కళ్యాణ్ ఎంతో విలువ ఇస్తాడని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కుడిచేతి ఉంగరపు వేలికి ఈ ఉంగరాన్ని ధరించడం విశేషం త్రివిక్రమ్ సూచనల మేరకు పవన్ ఈ ఉంగరాన్ని ధరించి ఉండవచ్చని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.


 


పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఎంతగానో నమ్ముతారనే విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ జాతకాన్ని జ్యోతిష్యునికి చూపించారని పవన్ పొలిటికల్ కెరీర్ కు ఆ ఉంగరంబాగా ప్లస్ అవుతుందని సమాచారం. ఆ ఉంగరం బరువు 4 క్యారెట్లు అని తెలుస్తోంది. ఆ రింగ్ వల్ల పవన్ జాతకం మారి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారేమో చూడాలి మరి. మరోవైపు పవన్ సినిమాల షూటింగ్ కు సంబంధించి క్లారిటీ కూడా రావాల్సి ఉంది.


 


హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీఅయితే రావాల్సి ఉంది. పవన్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: