తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నానికి.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.. ఇక తన నటన కి తను చేసే సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఏలాంటి పాత్రలోనైనా.. జీవించి నటించగలరు అన్నట్లుగా నటిస్తాడు నాని. అయితే గత కొన్ని సినిమాలు మాత్రం వరుసగా డిజాస్టర్ తో నాని సతమతమయ్యే అలా చేశాయి. కానీ చివరిగా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక దీనితో బాక్సాఫీస్ దగ్గర మరొకసారి తన కలెక్షన్ తో తన మార్కును చాటుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి సక్సెస్ ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు నాని.


అందుకోసం ఒక విభిన్నమైన పాత్రను ఎంచుకుని నటిస్తున్నారు ఆ చిత్రమే "సుందరానికి" ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకున్నారు నాని. దీంతో తన తదుపరి చిత్రం దసరా సినిమా షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని డైరెక్షన్ చేయబోతున్నారు. కథానాయకుడిగా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇక ఈ సినిమా కథను సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది చిత్రబృందం.


ఇక ఈ చిత్రంలో కూడా నాని ఒక విభిన్నమైన గెటప్ తో కనిపించారు. ఇందులో నాని ధరణి అనే పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా నాని ఇండియాగ్లిటేజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నాని మాట్లాడుతూ ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమా.. హార్ట్ హి ట్టింగ్ ఎంటర్టైన్మెంట్ లో ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల లోకి తీసుకురావాలని నాని, చిత్ర బంధం ఎంతో ప్రయత్నిస్తోంది. దీంతో ఆయన అభిమానులు మాత్రం మరొకసారి హీరో నాని హిట్ కొట్టేలా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఇందులో ముఖ్యమైన పాత్రలు సముద్రఖని, సాయి కుమార్ తదితరులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: