చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద విజయాన్ని సాధించింది ది కాశ్మీరు ఫైల్స్.  ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ సినిమాకు సంబంధించిన చర్చ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ వివేక అగ్నిహోత్రి ఎలాంటి కమర్షియల్ రంగులు లేకుండా తక్కువ బడ్జెట్ తో ఇక సహజత్వానికి దగ్గరగా ఈ సినిమాని తెరకెక్కించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అందరూ కూడా భావోద్వేగానికి గురి అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 1990లలో కాశ్మీర్ పండిట్ల పై జరిగిన దాడులను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇక ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. కాగా ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించారు అనే విషయం తెలిసిందే. అయితే సినీ ప్రముఖుల నుంచి అటు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇక మరికొంతమంది ఇక ఈ సినిమా బాలేదు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమా చూసి భావోద్వేగానికి గురి అయినట్లు చెప్పుకొచ్చారు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఈ విషయంపై స్పందించి 1990లలో కాశ్మీర్ పండిట్ లపై జరిగిన దాడులు విచారకరమని బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక అలాంటి సంఘటనలు కథాంశంగా తీసుకొని రూపొందిన కాశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాన్ని ప్రతి భారతీయుడు చూడాలి. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం భావోద్వేగానికి గురి చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. వర్క్ బిజీ లో ఉండి తాను ఇంకా సినిమా చూడలేకపోయానని.. కానీ త్వరలోనే చూస్తాను అంటూ అమీర్ ఖాన్ తెలిపాడు. ఇక అమీర్ ఖాన్ ఇలా అనడంతో ఆయన అభిమానులు అందరూ కూడా ఈ సినిమా చూసేందుకు సిద్ధమైపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి: