ఇందులో హీరోయిన్ గా కేథరిన్, కృతి శెట్టి నటిస్తున్నారు. ఇటీవల హీరో నితిన్ ఈ సినిమాకి కీలకమైన ఒక యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసినట్లుగా సమాచారం. ఈ సినిమా ఫైట్ కు సంబంధించి ఫైట్ మాస్టర్ అనల్ -అరసు కొరియోగ్రాఫర్గా పనిచేశారట. గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రం నుంచి ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు. అయితే ఈ రోజున ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ ని అభిమానులతో పంచుకోవడం జరిగింది. మాచర్ల నియోజకవర్గం.. ఫస్ట్ లుక్ ఫస్ట్ చాప్టర్ అనే పేరుతో డిఫరెంట్ గా ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు గా తెలియజేశారు.
ఇక ఇందులో హీరో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ గా కనిపిస్తున్నారట. ఇందులో నితిన్ పాత్ర పేరు..N. సిద్ధార్థ రెడ్డి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఆర్డర్ లెటర్ ని కూడా చిత్రబృందం ఈ రోజున విడుదల చేయడం జరిగింది. సినిమాలో కాన్సెప్ట్ భాగంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా ఇదే పద్ధతిలో చిత్ర బృందం విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం నుంచి వచ్చినాయి ఈ ఆర్డర్ పోస్టర్ బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఈ నెల 26 వరకు వేచి చూడాల్సిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి