గణేష్ మాస్టర్.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్నాడు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో సాంగ్స్ అటు  సూపర్ హిట్ గా నిలిచాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లే కాదు ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్ తో కూడిన కొరియోగ్రఫీ  కూడా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువగా గణేష్ మాస్టర్ డాన్స్ లు సమకూరుస్తూ ఉంటాడు. అయితే గణేష్ మాస్టర్ గురించి అందరికీ తెలుసు.  కానీ గణేష్ మాస్టర్ మనసు ఎంత గొప్పది అనే విషయం మాత్రం కొంత మందికి మాత్రమే తెలుసు.


 ఎందుకంటే ఎప్పుడూ ఎంతో సైలెంట్ గా ఉండే గణేష్ మాస్టర్ ఎవరు ఆపదలో ఉన్న ఆదుకుంటాడు అనే విషయం ఈ టివి లో ప్రసారమైన డాన్స్ రియాల్టీ షో ఢీ షో ద్వారా తెలిసింది. ఎందుకంటే ఢీ షో లో జడ్జిగా వచ్చిన సమయంలో ఒక కంటెస్టెంట్స్ తనకు మూడు లక్షల అప్పు ఉందని తన తల్లి దానికోసమే కష్టపడుతూ ఉంది అంటూఎమోషనల్ కావడంతో ఇక ఆ మూడు లక్షలు అప్పు నేను తీరుస్తాను అంటూ వెంటనే చెక్ ఇవ్వటం కేవలం గణేష్ మాస్టర్ కు మాత్రమే సాధ్యమైంది. అంతే కాదు ఏకంగా ఒక కంటెస్టెంట్ కి కార్ గిఫ్ట్ గా ఇస్తాను అంటూ చెప్పడం గమనార్హం.



 ఇకపోతే ఇప్పుడు మరోసారి ఢీ షో లో భాగంగా గణేష్ మాస్టర్ గొప్ప మనసు చాటుకున్నాడు. మొన్నటివరకు జడ్జిగా జానీ మాస్టర్ వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జానీ మాస్టర్ స్థానంలో గణేష్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఒక యాక్సిడెంట్లో కాళ్లు కోల్పోయిన రైతు జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఒక పర్ఫామెన్స్ చేస్తారు. ఇక ఇది చూసిన గణేష్ మాస్టారు ఎంతో ఎమోషనల్ అవుతాడు. ఇక ఢీ స్టేజి మీదికి వచ్చిన రైతుకు ఏకంగా తన 2 ఎపిసోడ్ లకు సంబంధించిన రెమ్యునరేషన్ ఇచ్చేస్తాను అంటూ చెబుతాడు. దీంతో గణేష్ మాస్టర్ ఎంత గొప్పవాడు అని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: