ఎవరో కూడా తెలియని ఈమె మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఈమె క్రేజ్ ఆకాశానికి చేరుకుంది అని చెప్పవచ్చు . అంతేకాదు వెండితెరపై అవకాశాలు కూడా ఈ ముద్దుగుమ్మకు వస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసుల ఆధ్వర్యంలో హిమ వీర్ వైన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి హర్నాజ్ పాల్గొన్నారు.
ఇక దేశానికి సరిహద్దుల్లో వెన్నెముకలా కాపు కాస్తున్న జవాన్లను దృష్టిలో పెట్టుకొని సైనికుల సేవలను కొనియాడి ఆ తర్వాత జవాన్ల కుటుంబ సభ్యులతో అలాగే వారి పిల్లలతో కలిసి ఫోటోలు దిగింది. అంతే కాదు వారందరితో కలిసి సరదాగా డాన్స్ కూడా వేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. పంజాబీ పాటలకు అద్భుతంగా స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈమె డాన్స్ ఈవెంట్ మొత్తానికి హైలెట్గా నిలిచింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ వీడియోలను స్వయంగా ట్విట్టర్ ఖాతా ద్వారా ఐటిబిపి షేర్ చేయడం గమనార్హం. మిస్ యూనివర్స్ 20 21 హర్నాజ్ కౌర్ సంధు హిమ వీర్ కుటుంబాలు.. వారి పిల్లలతో కలిసి గ్రూప్ పర్ఫామెన్స్ చేశారు అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేయడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి