టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి కి విడుదలైన బంగార్రాజు సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు,  ఇది ఇలా ఉంటే నాగార్జున 'బంగార్రాజు'  సినిమా కంటే ముందే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీ ని ప్రారంభించాడు.  కాకపోతే ది ఘోస్ట్ మూవీ కంటే వెనకాల ప్రారంభమైన బంగార్రాజు సినిమా ఇప్పటికే విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించింది,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ది ఘోస్ట్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ లో మొదట  కాజల్ అగర్వాల్ ను చిత్ర బృందం హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది,  కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకుంది ఆ తర్వాత కాజల్ అగర్వాల్ ప్లేస్  లో చిత్ర బృందం సోనాల్ చౌహాన్ ను  హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది,  ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ ను చిత్రయూనిట్ ప్రకటించింది.

  దుబాయ్‌ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ ను చిత్ర బృందం పూర్తి చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. నాగార్జున, సోనాల్ చౌహాన్ ఉన్న పోస్టర్ లను  చిత్ర బృందం విడుదల చేసింది,  ఈ షెడ్యూల్‌ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ ను,  కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ ను చిత్రకరించాం,  లొకేషన్ విజువల్స్ అధునాతన సాంకేతికత తో లావిష్‌గా గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించాం , యాక్షన్, విజువల్ ఫీస్ట్ సినిమాలను ఆస్వాదించేవారికి ది ఘోస్ట్ చిత్రం కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా, ఎడారి లో చేసిన యాక్షన్ సీక్వెన్స్ మూవీ లోని స్టంట్ సీక్వెన్స్ల్‌లో హైలైట్‌గా ఉంటాయి.. అని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లపై  ఈ సినిమాని నిర్మిస్తున్న నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: