అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  కృతి సనన్ ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా  నటించకపోయినా అప్పటికి బాలీవుడ్ లో నటించిన సినిమాల ద్వారానే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.  ప్రస్తుతం కృతి సనన్,  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాలో నటిస్తోంది,  ఇది ఇలా ఉంటే అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ మరో క్రేజీ మూవీ లో చాన్స్ దక్కించుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది,  అసలు విషయం లోకి వెళితే...  టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణం లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే,  కోలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న విజయ్ మొట్ట మొదటి సారి నేరుగా ఒక తెలుగు సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 ఇలా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి,  ఇలా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతోంది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో కృతి సనన్ ని హీరోయిన్ గా చిత్ర బృందం కన్ఫర్మ్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది,  ఇది ఇలా ఉంటే వంశీ పైడిపల్లి , విజయ్  కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కృతి సనన్ ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: