టాలీవుడ్‌లో ఈ మధ్య రీమేక్‌ స్టోరీలు ఎక్కువవుతున్నాయి. స్టార్ హీరోలు కూడా రీమేక్స్‌ చేసేందుకు పోటీ పడుతున్నారు. కానీ పక్క రాష్ట్రాల నుంచి రీమేక్ రైట్స్‌ తెచ్చుకుంటోన్న, హీరోలు నిర్మాతలు కథని మాత్రం అక్కడే వదిలేస్తున్నారు. హీరోయిజం మాటున ఒరిజినల్ సోల్‌ని చంపేసి రీమేక్‌లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్' గురించి సోషల్‌ మీడియాలో ఇప్పటికీ బోల్డన్ని చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది పవన్‌ అదరగొట్టాడంటే, మరికొంతమంది మాత్రం ఒరిజనల్‌ సోల్‌ మిస్‌ అయిందని, హీరోయిజం కోసం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూలకథని మార్చేశారని విమర్శిస్తున్నారు. మళయాళంలో రెండు వ్యక్తిత్వాల మధ్య సంఘర్షణగా తెరకెక్కితే, ఇక్కడ హీరో, విలన్‌ పోరాటంగా మార్చేశారని కామెంట్లు చేస్తున్నారు.

'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాలో బిజూమీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా చేశారు. వీళ్లిద్దరి పర్సనాలిటీస్‌ని రిప్రజెంట్‌ చేస్తూ టైటిల్‌ కూడా అప్పనుమ్ కోషియుమ్ అని పెట్టారు. ఇక తెలుగు రీమేక్‌లో ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్, రానా ఉన్నారు. కానీ పవన్‌ని పవర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేయడానికి వ్యక్తిత్వాల సంఘర్షణని కాస్తా ఒక వ్యక్తి కథగా మార్చారని, సింగిల్‌ హీరో సినిమాగా మార్చేశారని విమర్శిస్తున్నారు సినిమా లవర్స్.

పవన్‌ కళ్యాణ్‌ రీ-ఎంట్రీ మూవీ 'వకీల్‌సాబ్'పైనా విమర్శలున్నాయి. హిందీ హింట్ 'పింక్' రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మూల కథని డీవియేట్ చేశారని, హీరోయిజం కోసం ఒరిజినల్ సోల్‌ని చంపేశారనే కామెంట్స్‌ వస్తుంటాయి. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ కథతో పాటు ట్రావెల్ చేస్తే, పవన్ కళ్యాణ్‌ మాత్రం డ్యూయెట్లు ఇంట్రడక్షన్‌ ఫైట్స్‌ అని కథ మొత్తాన్ని మార్చేయించాడనే కామెంట్స్‌ వచ్చాయి.

చిరంజీవి రీఎంట్రీ కూడా రీమేక్‌ సినిమాతోనే మొదలైంది. తమిళనాట భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న 'కత్తి' సినిమాని 'ఖైదీ నం.150'గా రీమేక్‌ చేశాడు చిరు. అయితే ఈ మూవీ రిలీజైనప్పుడు బోల్డన్ని విమర్శలొచ్చాయి. రైతు ఆత్మహత్యల గురించి ప్రస్తావించిన సీరియస్‌ సబ్జెక్ట్‌ని కామెడీ ట్రాకులు, ఐటెమ్‌ సాంగ్స్‌తో కమర్షియల్‌ మూవీగా మార్చేశాడనే కామెంట్స్ వచ్చాయి.

చిరంజీవి ప్రస్తుతం రెండు రీమేకులు చేస్తున్నాడు. తమిళ హిట్ 'వేదళం'ని భోళాశంకర్‌గా చేస్తున్నాడు. అలాగే మళయాళీ హిట్‌ 'లూసిఫర్'ని గాడ్‌ఫాదర్‌గా మార్చేశాడు. ఇక పవన్ కల్యాణ్‌ నెక్ట్స్ తమిళ హిట్‌ 'వినోదయ సిత్తం' రీమేక్‌ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.  దీంతో మెగాబ్రదర్స్‌ ఈ రీమేకులని ఎలా మార్చేశారో అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: