తాజాగా పూజా హెగ్డే నేషనల్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలోనే నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ప్రభాస్ అభిమానుల చేత పూర్తి స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది ఈ పొడుగు కాళ్ల సుందరి. ఇకపోతే ఈమె నెటిజన్ల చేత విమర్శించబడడానికి గల కారణం ఏమిటి అంటే పూజా హెగ్డే మొదటిసారి ప్రభాస్ సరసన పాన్ ఇండియా సినిమా అయిన పీరియాడికల్ రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది అయితే ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈమె తాజాగా తమిళంలో కూడా విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతా బాగున్నప్పటికీ పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా రాధే శ్యామ్ సినిమాకు సంబంధించి ఏ మాత్రం కూడా ప్రమోట్ చేయలేదు. అంతే కాదు స్పందించాల్సిన సమయంలో ఈమె సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడు ఈమె నటిస్తున్న బీస్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా గొప్పగా పొగుడుతూ ఉండడంతో.. రాధే శ్యామ్ సినిమా సమయంలో ఎందుకు సైలెంట్ గా ఉంది అంటూ ఆమెపై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పై పూజా హెగ్డే ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి