ఆర్. ఆర్. ఆర్. సినీ ఇండస్ట్రీ లోనే ఒక ప్రభంజనం అని చెప్పవచ్చు.  కేవలం తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయి విశేష స్పందన పొందడమే కాకుండా ఇతర భాషా దర్శకులు సైతం రాజమౌళి నీ చూసి కుల్లుకునేలా ఈ సినిమా మొదటి స్థానంలో నిలబడింది. ఇక మొదట్లో బాలీవుడ్ దర్శకులు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని పూర్తిగా అవహేళన చేసిన విషయం తెలిసిందే.. కానీ ఈ సినిమాతో బాలీవుడ్ దర్శకులు సైతం తెలుగు సినిమా దర్శకులకు సలాం కొడుతున్నారు.

సినిమా అయినా సరే కథాంశం, కథ ప్రకారం ప్రేక్షకులను మెప్పించింది అంటే .. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నట్లే . ఇక ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి విడుదలయ్యే చాలా సినిమాలు బాలీవుడ్లో వంద కోట్ల క్లబ్ లో చేరిపోవాలని తెగ ఆసక్తి చూపుతూ ఉంటాయి. ఇక అలాంటి క్లబ్లోకి తాజాగా పాన్ ఇండియా సినిమా పుష్ప చేరి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వంద కోట్ల క్లబ్ ను దాటేసే చిత్రం ఇప్పటి వరకు రాలేదు అని అందరూ అనుకున్నట్టుగానే.. ఈ వార్తలను కొట్టి పారేసింది ఆర్.ఆర్.ఆర్. చిత్రం.

ఆర్. ఆర్.ఆర్ ప్రస్తుతం రూ. 1000 కోట్ల క్లబ్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గడిచిన గత పది రోజులలో ఏకంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలను బాక్స్ ఆఫీసు వద్ద షేర్ ను రాబట్టి ప్రపంచ సినీ పరిశ్రమ తెలుగు సినిమా వైపు కన్నెత్తి చూసేలా చేసాడు రాజమౌళి. మరొక రెండు రోజులు గడిస్తే కచ్చితంగా ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్లో చేరి పోతుందని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా ప్రేక్షకులను బాగా అలరించడమే కాకుండా ఇందులో నటించిన ప్రతి నటి నటులకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR