ఇకపోతే ఈ సినిమాలో వైష్ణవ తేజ్ యంగ్ పవన్ కళ్యాణ్ గా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమాలో బారు జుట్టుతో వీల్ చైర్ లో కనిపించే శ్రీరామచంద్రమూర్తి అనే పాత్రలో నటించి అందరినీ బాగా ఆకట్టుకున్నాడు. ఇక పోతే పోయిన సంవత్సరం కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు రన్ అవుతున్నప్పటికీ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు. ఇక మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఈ మెగా మేనల్లుడు.
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది కమర్షియల్ సినిమాల వెంటపడుతుంటే వైష్ణవ్ తేజ్ మాత్రం కాన్సెప్టు ఓరియెంటెడ్ మూవీస్ మొదలుపెట్టడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రంగ రంగ వైభవంగా సినిమా ద్వారా కొత్త దర్శకుడు గిరిసాయ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పూర్తి స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి