‘కేజీ ఎఫ్ 2’ ఘనవిజయం సాధించడంతో దక్షిణాది నుండి రాజమౌళి మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ కూడ భారీ సినిమాలను తీసి వాటిని పాన్ ఇండియా మూవీలుగా నిలబెట్టగలడు అన్న క్లారిటీ వచ్చింది. సినిమా బడ్జెట్ విషయంలో రాజమౌళి సినిమాల కంటే ప్రశాంత్ నీల్ సినిమాల బడ్జెట్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సినిమాను వేగంగా తీయడంలో రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ చాల క్లారిటీగా ఉంటాడు అని అంటారు.


ఇప్పటివరకు టాప్ హీరోలు అంతా రాజమౌళితో సినిమాలు చేయడం గురించి కలలు కనేవారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సాధించిన ఘన విజయంతో చాలామంది టాప్ హీరోలు రాజమౌళితో పనిచేస్తూ సంవత్సరాల తరబడి ఆయన బందిఖానాలో ఉండే కంటే ప్రశాంత్ నీల్ తో ఒక భారీ సినిమాను చేయవచ్చు కదా అన్న ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ దృష్టి ప్రశాంత్ నీల్ పై పడింది అంటున్నారు. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘పుష్ప 2’ పూర్తికాగానే బన్నీ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్’ తీస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కు కొనసాగుతున్న భారీ క్రేజ్ రీత్యా భారీ రేట్లకు అమ్మే ఆస్కారం ఉంది.


అదేవిధంగా జూనియర్ కూడ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నట్లు టాక్. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియకపోయినా వీరిద్దరి కాంబినేషన్ పై ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అదేవిధంగా తమిళ టాప్ హీరో విజయ్ కూడా ప్రశాంత్ నీల్ వైపు చూస్తున్నట్లు టాక్. దీనితో మన దక్షిణాదికి చెందిన టాప్ హీరోలకు కేవలం రాజమౌళి మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ రూపంలో మరొక క్రేజీ దర్శకుడు దొరికాడు అన్న మాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: