ఆర్ ఆర్ ఆర్’ మూవీ 9వందల కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టుకున్నప్పటికీ ఈమూవీ బయ్యర్లు చాల చోట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈమూవీని చాలామంది బయ్యర్లు అత్యధిక రెట్లు పెట్టి కొనడంతో చాలమందికి ఈమూవీకి సంబంధించి చాల తక్కువ లాభాలు వచ్చాయని మరికొందరైతే కనీసం తమ పెట్టుబడికి తగ్గ లాభాలు కూడ రాలేదని బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించి బిసి సెంటర్ల బయ్యర్లకు వారు పెట్టిన పెట్టుబడి కూడ కనీసం రాలేదనే మాటలు కూడ వినిపిస్తున్నాయి. అయితే ఈమూవీ వలన నష్టపోయాము అని ఎవరు బయటపడటం లేదు అని అంటున్నారు. అయితే ‘కేజీ ఎఫ్ 2’ పరిస్థితి వేరు. ఈ మూవీని బయ్యర్లు ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోల్చుకుంటే తక్కువ రేట్లకే కొన్నారు. ఇప్పుడు వీరందరికీ వారు పెట్టిన పెట్టుబడి పై నూటికి నూరు శాతం లాభాలు రావడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది.
దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్లకంతే ‘కేజీ ఎఫ్ 2’ బయ్యర్లు అదృష్టవంతులు అన్న ప్రచారం జరుగుతోంది. మరి కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ‘కేజీ ఎఫ్ 2’ విడుదల అయిన తరువాత ముందుగా అనుకున్న ఏప్రియల్ 28న ‘ఆర్ ఆర్ అర’ విడుదలై ఉంటే ‘కేజీ ఎఫ్ 2’ చూసిన కళ్ళతో ‘ఆర్ ఆర్ ఆర్’ ను చూసినవారు 9వందల కోట్లు ఇచ్చి ఉండేవారేనా అంటూ ఇండస్ట్రీలో మరికొందరి కామెంట్స్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి