నేచ్యురల్ స్టార్ నాని వివాదాలకు దూరంగా ఉంటూ టాప్ హీరోలు అందరితోను సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. వరస ఫ్లాప్ ల తరువాత ‘శ్యామ్ సింగరాయ్’ ఇచ్చిన ఉత్సాహంతో ఈ సంవత్సరం సమ్మర్ రేస్ లో ఒక హిట్ కొట్టి తీరాలని చాల పక్కాగా ప్లాన్ చేసుకుని ఈ సంవత్సరం సమ్మర్ రేస్ కు ముగింపు పలికే విధంగా తన మూవీ ‘అంటే సుందరానికి’  జూన్ 10న విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడు.


వివేక్ ఆత్యేయ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన టీజర్ కు అదేవిధంగా పాటలకు మంచి స్పందన రావడంతో ఈమూవీ తనకు ఖచ్చితంగా సక్సస్ ఇస్తుందని నాని ఆశపడుతున్నాడు. అయితే ఇప్పుడు నాని ఆశలకు మహేష్ అడ్డు తగులుతాడా అన్న సందేహాలు వస్తున్నాయి. దీనికి కారణం ‘సర్కారు వారి పాట’ మూవీ.


వాస్తవానికి ఈమూవీ 12న విడుదల కావలసి ఉంది అయితే ఈసినిమాకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కావడంతో పాటు సెంటిమెంట్ గా మహేష్ కు మే నెల అంటే కొంతభయం ఉన్న పరిస్థితులలో ఈమూవీని జూన్ 3న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్నచర్చలు జరుగుతున్నట్లు టాక్. అదే జరిగితే నాని సినిమా కంటే కేవలం వారం రోజుల ముందు మహేష్ సినిమా విడుదల అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ధియేటర్ల విషయంలో సమస్యలు ఏర్పడటమే కాకుండ ఏకంగా మహేష్ సినిమాతో పోటీ పడవలసిన పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు.


అయితే ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది కాబట్టి కేవలం ఒక వారం గ్యాప్ లో తమ సినిమా పై తమ మరో సినిమాను విడుదల చేసి అనవసరంగా నష్టపోరు అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో మహేష్ ఆలోచనల బట్టి ‘అంటే సుందరానికి’ అడుగులు పడతాయి అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: