‘అల వైకుంఠ పురములో’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ వచ్చిన తరువాత కూడ త్రివిక్రమ్ కు రకరకాల కారణాలు వల్ల రెండున్నర సంవత్సరాల గ్యాప్ ఏర్పడింది. అయితే త్రివిక్రమ్ చాల తెలివైనవాడు కాబట్టి ఈ గ్యాప్ లో ‘భీమ్లా నాయక్’ మూవీకి స్క్రిప్ట్ అందించి భారీ పారితోషికం పొందాడు అని అంటారు.త్వరలో ప్రారంభం కాబోతున్న పవన్ కళ్యాణ్ సముద్రఖని మూవీ ప్రాజెక్ట్ కు కూడ త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందిస్తూ భారీ పారితోషికం తీసుకోబోతున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మహేష్ మూవీతో త్రివిక్రమ్ ప్రస్తుతం బిజీగా ఉన్నప్పటికీ ఈ మూవీ తరువాత మళ్ళీ త్రివిక్రమ్ కు చాల పెద్ద గ్యాప్ వచ్చే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


దీనికి కారణం టాప్ హీరోలు ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ పవన్ చిరంజీవి లు మరో రెండు సంవత్సరాల వరకు వారి వారి సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు. త్రివిక్రమ్ చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆశక్తి కనపరచడు. ఆయన దృష్టి అంతా టాప్ హీరోల పైనే ఉంటుంది. టాప్ హీరోలు అందరు పాన్ ఇండియా మూవీల పై దృష్టి పెడుతున్నారు.


త్రివిక్రమ్ ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా పాన్ ఇండియా మూవీలు తీయలేదు. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలను తీయలేడు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ తగ్గట్టుగానే త్రివిక్రమ్ తన సినిమాలలో తన మాటల మాయతో ప్రేక్షకులను జోష్ లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ భారీ యాక్షన్ సన్నివేశాలు తీయాలని ప్రయత్నించడు. దీనితో మహేష్ తో తీయబోతున్న మూవీ తరువాత టాప్ హీరోలు ఎవరు ఖాళీగా లేరు కాబట్టి వెంకటేష్ వైపు త్రివిక్రమ్ చూసే ఆస్కారం ఉంది అంటున్నారు. దీనితో త్రివిక్రమ్ కు మిగిలింది ఎవరు అంటూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: