ఇటీవల విడులైన సినిమాలలో చిన్న సినిమా అయినా పెద్ద హిట్ ను అందుకున్న మన సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ రూపొందించిన సినిమా "డీజే టిల్లు". ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఈ సినిమాలో హీరోగా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, హీరోయిన్ గా నేహా శెట్టి న‌టించగా నూతన దర్శకుడు విమ‌ల్ కృష్ణ దర్శకత్వం వహించారు. అంతే కాదు ఈ సినిమా యొక్క టీజర్ , అలాగే ట్రైల‌ర్‌ లోని డైలాగ్స్ ఒక పెద్ద కాంట్ర‌వ‌ర్సీకి దారి తీశాయి అని చెప్పవచ్చు. చాలా స‌ర‌దాగా ఉండే రొమాంటిక్ కామెడీలా తీసిన "డీజే టిల్లు" సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగా ఆకట్టుకుంది. అంతే కాదు ఆ సినిమా లోని "అట్లుంటది మనతోని" డైలాగ్ మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. డిజే టిల్లు సినిమా లోని ఆ డైలాగ్ అంత ఫేమస్ అయింది.

ఈ సినిమాలో నేహా శెట్టి రాధికా అనే పాత్రలో నటించింది. డైరెక్టర్ విమల్ కృష్ణ నేహా శెట్టిని అన్ని విధాలుగా బాగా వాడుకున్నారు. నటనలో అన్ని వైవిధ్యాలను చూపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనితో ఈమె పేరు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మారు మ్రోగిపోతోంది. ఇప్పటికే వరుస అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ నేహా శెట్టి మాత్రం తొందర పడకుండా ఆచితూచి అడుగులు వేస్తోందట. ఈ సందర్భంలోనే ఒక సువర్ణావకాశాన్ని చేతులారా పోగొట్టుకుందని వార్తలు చిత్రపురిలో వినిపిస్తున్నాయి.

ఒక ప్రముఖ బ్యానర్ లో సినిమా చేయాలని ఒక నిర్మాత నేహా శెట్టిని సంప్రదించగా, అందుకు నేహా వెంటనే ఒకే చెప్పకుండా కొంచెం సమయం కావాలని కోరిందట. అయితే ఆ తరువాత ఈ ఛాన్స్ వేరే యంగ్ హీరోయిన్ ను వరించింది అని తెలుస్తోంది. అలా వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుంది నేహా శెట్టి.




మరింత సమాచారం తెలుసుకోండి: