‘కేజీ ఎఫ్ 2’ సూపర్ సక్సస్ సాధించడంతో ఈమూవీ కలక్షన్స్ ఆకాశమే హద్దుగా సాగిపోతున్నాయి. ఈమూవీకి పోటీ ఇచ్చే మరో భారీ సినిమా ఇప్పట్లో ఏది లేకపోవడంతో ఈమూవీ 1000 కోట్ల కలక్షన్స్ టార్గెట్ చేరుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దీనితో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది.


ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ ప్రశాంత్ నీల్మూవీ ప్రాజెక్ట్ పై మరింత భారీ అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇప్పుడు ఈమూవీకి ఇదే ప్రధాన సమస్యగా మారింది అని అంటున్నారు. టాప్ హీరో సినిమా పై విపరీతమైన అంచనాలు ఏర్పడితే దానిని అందుకోవడం చాల కష్టం. దీనికితోడు ప్రశాంత్ నీల్ ‘కేజీ ఎఫ్ 2’ తరువాత తీస్తున్న సినిమా కాబట్టి ఆసినిమా రేంజ్ ‘కేజీ ఎఫ్ 2’ ను మించి ఉండాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటాడు.


ఇలాంటి అంచనాలు ఏర్పడితే కథ ఏమాత్రం రొటీన్ గా ఉన్నా ప్రేక్షకులు అంగీకరించరు. ప్రేక్షకులకు తెలియని మరో లోకంలోకి సినిమా కథ తీసుకు వెళ్ళే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు అలాంటి స్థాయి ‘సలార్’ కు ఉందా లేదా అన్న విషయమై ప్రభాస్ ప్రశాంత్ నీల్ లు అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ 40 శాతం వరకు పూర్తీ అయింది అంటున్నారు.


ప్రభాస్ కు సర్జరీ జరగడంతో అతడు మళ్ళీ పూర్తిగా కోలుకునే వరకు ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే ఆస్కారం లేదు. ఈలోగా ప్రశాంత్ నీల్ ‘సలార్’ కథ విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ అవసరం అనుకుంటే మళ్ళీ ఈ మూవీని మొదటి నుండి రీ షూట్ చేసే ఆలోచనలు కూడ చేస్తున్నట్లు. దీనితో ఈమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో ప్రస్తుతానికి చెప్పలేము అని అంటున్నారు. ఒక సినిమా ఘన విజయం హీరోని గాని అదేవిధంగా దర్శకుడుని కాని ఏవిధంగా కన్ఫ్యూజ్ చేస్తుందో ‘సలార్’ విషయం మరొకసారి రుజువు చేస్తోంది అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: