టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా శ్రీ విష్ణు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ విష్ణు 'మెంటల్ మదిలో'  ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.  ఆ సినిమా తర్వాత నాది నీది ఒకే కథ సినిమాతో శ్రీ విష్ణు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన బ్రోచే వారెవరురా మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఇటు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి కూడా శ్రీ విష్ణు కి ఈ మూవీ లో నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న శ్రీ విష్ణు కొంతకాలం క్రితం అర్జున పాల్గొన్న మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.  కాకపోతే ఈ సినిమా శ్రీ విష్ణు కు నిరాశనే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు  భళా తందనాన సినిమాలో హీరోగా నటించాడు.  ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ హీరోయిన్ గా నటించింది.  భళా తందనాన మూవీ కి బాణం మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు.

సాయి కొర్రపాటి సమర్పణ లో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ మూవీ ని ఏప్రిల్ 30 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసి కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. భళా తందనాన మూవీ ని మే 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించింది.  మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు బాక్సాఫీస్ దగ్గర  ఎ రేంజ్ విజయాన్ని అందుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: