‘ఆచార్య’ ఫ్లాప్ ను మెగా కాంపౌండ్ తో సన్నిహితంగా ఉండే వర్గాలు కొరటాల ఎకౌంట్ లోకి నెట్టేసి మెగా కాంపౌండ్ తో మరింత సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసినిమాకు ఇలాంటి భయంకరమైన నెగిటివ్ టాక్ గంటలలో ఇరు రాష్ట్రాలలోను స్ప్రెడ్ అవ్వడం వెనుక ఒక బడా డిస్ట్రిబ్యూటర్ హస్తం ఉంది అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నట్లుగా గాసిప్పులు వస్తున్నాయి.


వాస్తవానికి ఆ బడా డిస్ట్రిబ్యూటర్ కి కొరటాల కు మధ్య ఏర్పడిన ఒక భేధాభిప్రాయం పెద్ద సమస్యగా మారి ‘ఆచార్య’ కు మొదటి నుండి నెగిటివ్ టాక్ ఏర్పడే విధంగా సహకరించింది అన్న అభిప్రాయాలు కూడ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ పాత్ర బాగా ప్రాచుర్యంలోకి వచ్చి జూనియర్ పాత్ర డల్ అవ్వడంతో అసహనానికి లోనైన జునియర్ అభిమానులలోని ఒక వర్గం చరణ్ కు మరొక హిట్ రాకూడదు అన్న అసహనంతో ‘ఆచార్య’ పై నెగిటివ్ టాక్ విపరీతంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు అన్న గాసిప్ కూడ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలో ఉంది.


మరికొందరైతే ‘ఆచార్య’ ఘోరంగా ఫ్లాప్ కావడంతో ఈమూవీకి పరోక్షంగా సహ నిర్మాతగా వ్యవహరించిన కొరటాల బయ్యర్లకు ఈమూవీ విషయమై హామీ సంతకాలు పెట్టాడు అంటూ మరొక గాసిప్పును ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. మహాభారతంలో కర్ణుడి మరణానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ‘ఆచార్య’ ఫెయిల్యూర్ కు కూడ అన్ని కారణాలు కనిపిస్తున్నాయి,


మృదు స్వభావిగా పేరు గాంచిన కొరటాల ఇప్పటివరకు పరాజయం అన్న పదం ఎరగడు. మొట్టమొదటిసారి అతడి కెరియర్ భయంరమైన ఫ్లాప్ ను ఎదుర్కుంటోంది. ఇది ఇలా ఉంటే మెగా ఫ్యాన్స్ లో చాలామంది  పవన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా విడిపోవడంతో చిరంజీవి చరణ్ ల ఫ్యాన్స్ సంఖ్య కొంతవరకు తగ్గిపోయింది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఇలా ‘ఆచార్య’ ఫెయిల్యూర్ కు అనేక కారణాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: