ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతడి మూవీలు అన్నీ ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అయినా రజనీకాంత్ పట్టు వీడకుండా మరో భారీ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తమిళ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో ఒక మంచి కథ ఎంపిక కావడంతో ఆమూవీ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలు ఎక్కబోతోంది.
ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ కు అదేవిధంగా రజనీకాంత్ కు చెప్పుకోతగ్గ స్థాయిలో హిట్స్ లేకపోవడంతో గతంలో రజనీకాంత్ అదృష్టాన్ని తెచ్చి పెట్టిన రమ్యకృష్ణ సెంటిమెంట్ ను మళ్ళీ తెరపైకి తీసుకు వస్తున్నారు. రమ్యకృష్ణ రజనీకాంత్ తో కలిసి నటించిన ‘నరసింహా’ మూవీ ఒకప్పుడు బ్లాక్ బష్టర్ హిట్. ఆమూవీలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర ఇప్పటి తరం వాళ్ళు కూడ టివి లలో ప్రసారం అవుతున్నప్పుడు చూస్తూ ఉంటారు.
ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి రజనీకాంత్ ఈమూవీలో 60 సంవత్సరాలు నిండిన ఇంటి పెద్దగా నటిస్తూ ఉంటే అతడి భార్యగా రమ్యకృష్ణ నటించబోతోంది. రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యలు కూడ పక్కకు పెట్టి ఒక బ్లాక్ బష్టర్ హిట్ తో తన కెరియర్ ముగించాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ప్రయత్నాలకు రమ్యకృష్ణ సెంటిమెంట్ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి. అయితే ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలకు ఎన్ని సెంటిమెంట్స్ ఫాలో అయినా ఆ సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. ఓటీటీ మూవీలు అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో సినిమా ఎంతో అద్భుతంగా ఉంటే కాని సగటు ప్రేక్షకుడు ధియేటర్ల వైపు చూడటంలేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి